ఉద్దేశ్యము

 
Thumbnail


ఈ జన్మ ఎందుకురా భగవంతుడా !
ఓరి దేవుడో ఇప్పుడు ఏమి చేసేది నాయనో
ఎక్కడున్నావ్ రా తండ్రీ


ఇలా అనిపించని వారుండక పోవచ్చు సృష్టిలో ....
ఇది ఒక క్షణమో గంటో లేక ఒక దినమో పోనీ కొన్ని రోజులో అనిపించినప్పటికీ,
కొంత కాలానికి మరుపు వచ్చేస్తుంది...
నాకా ఇంత దుర్భరమైన జీవితం అప్పట్లో కలిగింది అనే స్పృహ లేక జ్ఞప్తి కూడా కలుగక పోవచ్చు ...
కాని
ఇది నిజం
అబద్ధం లో పడి నిజాన్ని మరవటానికే నేటి  మానవాళి అలవాటు పడింది...
అవును
అబద్దం బహు రుచిగాను నిజం చేదు గాను ఉంటుంది..,


సరే ఇది కలా లేక నిజామా అనే సందర్భాలు కొందరికి అరుదుగా మరికొందరికి అనునిత్యం ఎదురౌతాయి..


మనం నడిచేటి దారిలో ఉపద్రష్ట Electricals వేదాంత IAS Academy సాక్షి news paper ఇలా మనకు ఏవో దేనినో సూచిస్తూ ఉన్నా మనకు అవి వేటిని సూచిస్తున్నాయో ఎందుకు సూచిస్తున్నాయో అంతు పట్టదు.


మనం అంతా, విషాల్లో (ఇంద్రియ విషయాల్లో) ఇరుక్కుపోయాం, మన జీవన్ విధానం లోని  అవివేక వంతమైన జీవన సరళియే మనల్ని బందీలుగా చేసింది, ఎంతగా బందీలం అయ్యమంటే బందీ గా "ఒక బానిసగా ఉన్నాను" అనే సంగతి మరిచేన్తల బందీలం అయ్యాం!


 వాస్తవానికి సూర్యుడు ఉదయించం అస్తమించటం అనేది ఎన్నడు లేనే లేదు, కాని మనకు సూర్యుడు ఉదయించినట్లుగా అస్తమించినట్ట్లుగా గోచరం అవుతున్నది, మనకు తెలుస్తున్న ఈ సూర్యస్తమయాలనే సత్యం అనుకుంటే అది పొరపాటే, అది కేవలం దృగ్గోచర సత్యమే, ఈ సత్యానికి ఒక పరిమితి ఉంది, ఇది చూసినంత మేర మటుకే సత్యం, వాస్తవం వేరే ఉంది, వాస్తవానికి సూర్యుడు ఉదయించటం అస్తమించటం అనేవి లేదు.
భూ భ్రమణం వలన కలిగిన మార్పే మనకు అలాంటి అసత్యానుభవాన్ని ఇస్తున్నది.
 .....
కనుక మనం ఏమి చెయ్యాలి,
మనకు మన నేటి తరం వాళ్ళకు పొట్ట కూటికే ఎక్కువ సమయం కేటాయించే పనిని మన parents అలవాటు చేస్తున్నారు, మనం అయిన కళ్ళు తెరిచి, దేనికి ఎంత ప్రాధాన్యతో అంతే ఇవ్వాలి,


కనీసం మనకు మనం అయిన శృతి మించకుండా జాగరూకులం కావాలి.
.....


భగవాన్ బుద్ధుడు, జీసస్ క్రైస్ట్, ఆది శంకరులు, షిరిడి సాయినాథులు, శ్రీ రామ కృష్ణ పరమహంస, అవతార్ మెహెర్ బాబా,  భగవాన్ రమణులు, భగవాన్ సత్య సాయి బాబా, జిళ్ళేళ్ళమూడి అమ్మ, భగవాన్ వెంకయ్య స్వామి వారు, పరమ పరివ్రాజికాచార్య శ్రీ శ్రీ శ్రీ జగద్గురు చంద్రశేఖర సరస్వతి స్వామి వారు, జిడ్డు కృష్ణ మూర్తి, భగవాన్ ఓషో ఇలా ఎందరెందరో ఈ  భువి పై అవతరించి మనకు సత్య పథాన్ని చూపారు,
ఆజన్మాంతం సత్యం కోసం పోరాడిన సోక్రటీస్, అరిస్టాటిల్ వంటి వారి జీవితాలు మనకు మరింత ప్రేరణ నిస్తాయి.
......


ఏదో తెల్లారకట్ట  లేచామా, రొండు చెంబుల నీళ్ళు పోసుకుని, నుదిటిన విభూతి చుక్కలు ధరించి,
లలితా విష్ణు సహస్రాలు పారాయణం చేసి, శివుడి నెత్తిపై నాలు చుక్కలు నీళ్ళు పోసేసి,
ఇవాల్టికి నీకు నాకు చెల్లు నీకు చెయ్యల్సింది నేను చేశాను నాకు ఇవ్వాల్సింది నువ్వు ఇవ్వు అంటే...
లాభం కొద్ది పాలే ,,,
యిది మంచి విధానమే, కాని సత్య పథానికి ఎంత వరకు తీసుకు వెళ్తున్నదని ఎవరికీ వారే ప్రశ్న వేసుకోవాలి,
బదులు బయటనుంచి కాదు లోపల వస్తుంది...
(note : అయితే వీటిని మానమని కాదు, ఏ లక్ష్యం తో చేస్తున్నామో తెలిసి చేయాలని పెద్దల ఉవాచ)


 ........


 మనము మనుషులమే అందరిలానే,
కానీ మహాత్ములు కొందరున్నారు మిగితా మన లాంటి వారికి జీవన విధిని విధానాన్ని ఉపదేశించారు,
కష్టం వచ్చినప్పుడు హృదయం కరిగేలా ప్రార్థిస్తే ఏ దేవుడైన కరుణిస్తాడు, ప్రార్థన సమయం లో ప్రతి వ్యక్తి భక్తుడౌతాడు,  కాని  కష్టం తీరిన కొద్ది కాలం లోనే మల్లి యథా స్థితి చేరుకుంటాడు.


ఇది కాదు సరైన పద్ధతి,,
నిజంగా సాధన మార్గం లోకి అడుగు పెట్టె తరుణం ఇదే, అవును ఇదే...
కష్టం వచ్చిందా రాని,
ఈ సారి ఈ కష్టం లో నేను దేవుడిని అడగను కష్టం తొలగించమని,
ఈ సారి గురువు ని ప్రార్థిస్తాను  


ఓ గురు మూర్తి,,,
నాకు నా సాధనా బలాన్ని , గురు వాక్య విశ్వాస పటిమను చూసే చూపే సమయం వచ్చింది,


ఎట్టి పరిస్థితుల లోను నా స్వస్థితి నుండి నన్ను తప్పించక నన్ను కాపాడు తండ్రీ,


నీవె  నా మార్గము, దైవమె (సత్యమే) నా లక్ష్యము.


నాకు స్వతహాగా సత్యం పై ఆసక్తి లేదు, నేను జిజ్ఞాసిని కాను, ముముక్షుత్వం పాళ్ళు నాకు చాల తక్కువే,
అయిన నా స్థాయి లో నేను నా జీవితం లో ఎదురౌతున్న సంఘటన ల ద్వారా,
నా అనుభవాల ద్వారా సత్యం తెలుసుకునే యత్నం చేస్తాను.


నీవే నా తోడు, నీ నా రక్ష.


To be continued ......................................


ఈ అపరోక్షానుభూతి కి రెఫెరెన్సు గా ఉపయోగిస్తున్న గ్రంథాలు..
౧. వ్యాసాశ్రమము వారిది, (శ్రీ సద్గురు మళయాళ స్వామి)
౨. చిన్మయ mission వారిది, (స్వామి చిన్మయానంద)
౩. శ్రీ సీత రామ ఆది శంకర ట్రస్టు ఆనంద్ బాగు మల్కాజ్ గిరి హైదరాబాదు వారిది. (శ్రీ అద్వాయానంద భారతీస్వామి)
౪. బ్రహ్మ శ్రీ యల్లం రాజు శ్రీనివాస రావు గారి ప్రవచన సౌజన్యం తో సమన్వయము)
౫, మా సత్సంగ గోష్టి సారాంశము.